*21.12.25 ఆదివారం  కర్రా సుబ్బారెడ్డి ఫౌండేషన్ కోవెలకుంట్ల వారి ద్వారా ప్రియతమనాయకుడు జననేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్, ఉచిత కంటి అద్దాలు పంపిణీ విజయవంతం*…
మాజీ ఎమ్మెల్యే కర్రా సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మందికి ఉచిత వైద్య చికిత్సలు…
కోవెలకుంట్ల పట్టణంలోని  కర్రా సర్కిల్ (బనగానపల్లె సర్కిల్) దగ్గర మాజీ ఎమ్మెల్యే కర్రా సుబ్బారెడ్డి ఫౌండేషన్, మరియు  శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాల వారిచే నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైనది. ఈ కంటి వైద్య శిబిరము నందు రెండు వందల మంది వివిధ వైద్య చికిత్సలు చేయించుకున్నవారికి  కర్రా గిరిజా హర్ష వర్ధన్ రెడ్డి, కర్రా హర్ష వర్ధన్ రెడ్డి, కర్రా తేజ వర్ధన్ రెడ్డి మరియు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిగార్ల చేతుల మీదుగాకంటి అద్దాలు పంపిణీచేసారు. ఈ సందర్భంగా కర్రా సుబ్బారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కర్రా తేజ వర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంస్థ సభ్యులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి గారలు మాట్లాడుతూ  కోవెలకుంట్ల మండలంలో    *కర్రా ఫౌండేషన్* తరపున డిసెంబర్ నెల 8వ తేదిన కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనదని,పేదలు , అభాగ్యులు  ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనేది ఈ సంస్థ ఉద్దేశమని తెలియచేశారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి   బిపి, షుగర్, గుండె, కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించారని పరీక్షల అనంతరం కంటి, గుండె శస్త్ర చికిత్సలు  అవసరమైన 25 మందిని   నంద్యాల శాంతిరాం హాస్పిటల్ కు తరలించడం జరిగిందన్నారు. కర్రా ఫౌండేషన్ సంస్థ ఏర్పాటుచేసిన మొదటి సంవత్సరంలోనే వికలాంగులకు ట్రై సైకిల్, చేతి కర్రలు, వాకర్సు అందజేశామన్నారు. 2024 వ సంవత్సరంలో చెవిటి వారికి వైద్య చికిత్సలు నిర్వహించి ఉచితంగా వినికిడి మిషన్లు అందజేశామన్నారు. ఈ సందర్భంగా  ఆ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ ఎంతో మంది పేద ప్రజలుకు ఈ సంస్థ ద్వారా  ఎన్నో సేవలు అందజేస్తున్నామన్నారు.